Jubilee Hills By Election:షేక్ పేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:51 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
1/4
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు.
2/4
ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు.
3/4
హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సవాల్ విసిరితే కిషన్ రెడ్డి స్పందించడం లేదన్నారు. మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. కొడంగల్‌లో తాను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉందని గుర్తు చేసుకున్నారు.
4/4
20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూశామన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్ రెడ్డి అడుగుతున్నారని.. ఆయనకు ఎందుకు ఇవ్వొద్దో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఏం ఇబ్బంది అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కటేనన్నారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Updated at - Nov 05 , 2025 | 09:52 PM