Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్..

ABN, Publish Date - Jan 16 , 2025 | 08:39 AM

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. దీంతో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా ప్రభుత్వం నిర్వహించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌, తదితర దేశాలకు చెందిన 50మంది కైట్‌ ఫ్లయర్స్‌ హాజరయ్యారు.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 1/6

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్ ఘనంగా జరిగింది.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 2/6

గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ర్టాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 3/6

సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 4/6

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన సందడిగా జరిగింది. మూడు రోజుల పాటు సందర్శకులు భారీ స్థాయిలో ఈ ఫెస్టివల్‌కు తరలి వచ్చారు.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 5/6

చివరి రోజు ముగింపు కార్యక్రమంలో టూరిజం శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్ పాల్గొన్నా వారికి మేమొంటోలు అందజేశారు. సందర్శకులతో సందడిగా స్టాళ్లు మారాయి.

Kite, Food Festival:ముగిసిన కైట్, ఫుడ్ ఫెస్టివల్.. 6/6

తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచారు.

Updated at - Jan 16 , 2025 | 08:42 AM