చేవెళ్ల ఆస్పత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు
ABN, Publish Date - Nov 03 , 2025 | 04:37 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీ నుంచి మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు . అలానే పీఎంఆర్ జనరల్ హాస్పిటల్ లో క్షతగాత్రులను చికిత్స చేస్తున్నారు.
1/5
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంకర లారీ, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోయింది.
2/5
ఈ ప్రమాదంలో తప్పించుకునేందుకు వీలులేని విధంగా టిప్పర్ లోని కంకర పడటంతో పలువురు ప్రయాణికులు మృతిచెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు.
3/5
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తమ వారి మృతదేహాలను చూసి.. పలువురు భోరున విలపిస్తున్నారు. కొన్ని మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి కావడంతో బంధువులకు అప్పగిస్తున్నారు.
4/5
తమ వారి డెడ్ బాడీలు తీసుకునేందుకు వచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగుతోంది.. పేరెంట్స్‌ను కోల్పోయి కొందరు.. బిడ్డలను కోల్పోయి ఇంకొందరు .. ఎవరిని కదిపినా గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
5/5
మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి.. కుటుంబసభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.
Updated at - Nov 03 , 2025 | 04:38 PM