హైదరాబాద్ హైటెక్స్‌లో బయో ఆసియా సదస్సు
ABN, Publish Date - Feb 25 , 2025 | 01:45 PM
ఇవాళ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఉదయం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సదస్సును మొదలుపెట్టారు.

ఈ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.

ఈ బయో ఆసియా సదస్సులో ఫార్మా, లైఫ్‌సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఏఐ ఆధారిత లైఫ్ సైన్సెస్, క్లినికల్ ట్రయిల్స్‌పై సదస్సులో చర్చించారు.

సులభతర పరిశోధనలు, ఉత్పత్తుల తయారీపై సదస్సులో డిస్కస్ చేశారు. వినూత్న ఆలోచనలు, విధివిధానాల మార్పిడి, అంకుర పరిశ్రమలపై కూడా కార్యక్రమంలో చర్చించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సదస్సు జరగడం ఇది రెండోసారి. గత బయో ఆసియా సదస్సులో జీవ వైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చించారు.

ప్రస్తుత సదస్సులో ప్రధానంగా ఏఐ ఆధారిత అంశాలపై చర్చ జరిగింది. బంగారు భవిష్యత్తు సాధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ అన్నారు.
Updated at - Feb 25 , 2025 | 01:46 PM