Telangana Bandh: తెలంగాణ బంద్... నిర్మానుష్యంగా రోడ్లు.. డిపోల్లోనే బస్సులు
ABN, Publish Date - Oct 18 , 2025 | 10:08 AM
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కారణంగా ఎక్కడిక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తెల్లవారుజాము నుంచి బీసీ సంఘాల నేతల రోడ్లపై వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
1/13
తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.
2/13
బంద్ ఎఫెక్ట్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి
3/13
దుకాణాలన్నీ మూతపడ్డాయి. రోడ్లపై ఒక్క వాహనం కూడా కనిపించని పరిస్థితి.
4/13
బస్ డిపోల వద్ద ఆందోళన చేస్తున్న బీసీ సంఘాల నేతలు
5/13
బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.
6/13
భూపాలపల్లి జిల్లాలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ బంద్‌కు బీసీ నాయకులు పిలుపు ఇచ్చారు.
7/13
బస్సులు డిపోలకే పరిమితం అవడంతో అక్కడే ఉండి పోయిన డ్రైవర్లు, కండెక్టర్లు
8/13
నిజామాబాద్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.
9/13
రోడ్డుపై వాహనాలను అడ్డుకుంటున్న బీసీ సంఘాల నేతలు.
10/13
బస్టాండ్లు, నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
11/13
రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మండలంలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.
12/13
బంద్‌లో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
13/13
బస్సులు లేక బస్టాండ్లలో ప్రయాణికుల నిరీక్షణ.
Updated at - Oct 18 , 2025 | 10:10 AM