Ram Mohan: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్
ABN, Publish Date - Jun 13 , 2025 | 07:43 AM
అహ్మదాబాద్‌లో గురువారం(జూన్12) ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణ పాలయ్యారు. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు.. భారీ ప్రమాదంతో కాలిపోయి, చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ విమాన ప్రమాద ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం విమాన ప్రమాద ఘటన చోటు చేసుకున్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన తీరును ఉన్నతాధికారులను అడిగి రామ్మోహన్ తెలుసుకున్నారు.

అహ్మదాబాద్‌లో గురువారం(జూన్12) ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణ పాలయ్యారు.

టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు.. భారీ ప్రమాదంతో కాలిపోయి, చెల్లా చెదురుగా పడిపోయాయి.

ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ చేరుకున్నారు.

ఈ ఘటన చోటు చేసుకున్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. విమాన ప్రమాద ఘటన తీరును ఉన్నతాధికారులను అడిగి రామ్మోహన్ తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు ఫోన్ చేసి సంఘటన స్థలంలో ఉండమని కోరారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

డీజీసీఐ, ఏఏఐ, ఎయిర్ ఇండియా, ఎన్డీఆర్ఎఫ్ స్థానిక పరిపాలన బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

ఈ విషాద సమయంలో బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మహావిషాదమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని తెలిపారు.

ఈ విమానంలో ఇతర దేశాలకు చెందిన జాతీయులు సైతం ఉన్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ విషాదకర, భయంకరమైన సంఘటనతో తాను పూర్తిగా షాక్ అయ్యానన్నారు. తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని తెలిపారు.

ఈ సమయంలో, తాను ప్రయాణికులు, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించగలనని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అనేక సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని గుర్తు చేశారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామని అన్నారు.

విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Updated at - Jun 13 , 2025 | 11:07 AM