బ్రిటిష్ పాలనలో లేని ఏకైక భారతీయ రాష్ట్రం..
ABN, Publish Date - Feb 18 , 2025 | 03:09 PM
బ్రిటిష్ వారు దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించారు. అయితే, బ్రిటిష్ పాలనలో లేని ఏకైక భారతీయ రాష్ట్రం ఒకటి ఉంది. ఆ రాష్ట్రం పేరు మీరు గెస్ చేయగలరా?

బ్రిటిష్ వారు దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ, దేశంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎప్పుడూ సొంతం చేసుకోలేకపోయారు.

అరేబియా సముద్రంతో చుట్టుముట్టబడిన ఈ సుందరమైన రాష్ట్రాన్ని చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ రాష్ట్రానికి వెళ్లాలని కలలు కంటారు.

బ్రిటిష్ పాలనలో లేని ఏకైక భారతీయ రాష్ట్రం ఏంటంటే గోవా.

బ్రిటిష్ పాలన నుండి గోవాను రక్షించడంలో పోర్చుగీసువారు కీలక పాత్ర పోషించారు.

బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశ సంపదను దోచుకుంటున్నప్పటికీ, గోవా పోర్చుగీస్ నియంత్రణలోనే ఉంది.

1498లో తమ ఉనికిని స్థాపించుకున్న పోర్చుగీస్ వారు గోవాను బ్రిటిష్ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకున్నారు.
Updated at - Feb 18 , 2025 | 03:09 PM