వానలో ట్రెక్కింగ్.. వేరే లెవెల్..
ABN, Publish Date - Jun 23 , 2025 | 06:16 PM
వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేస్తే ప్రకృతితో అనుబంధం మరింత బలపడుతుంది. వర్షాకాలంలో మీరు చేయగలిగే 5 బెస్ట్ ట్రెక్ లొకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

వర్షాకాలంలో ట్రావెల్ చేయగలిగే 5 బెస్ట్ ట్రెక్ లొకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్.. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా..

హిమాచల్ ప్రదేశ్.. హంప్టా పాస్ ట్రెక్. ఇది కులు లోయ లాహౌల్ లోయల మధ్య ఉంటుంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని లోయలు, ఎడారి లాంటి భూభాగాలను చూడవచ్చు.

మహారాష్ట్ర.. టోర్నా ఫోర్ట్ ట్రెక్. ఈ కోటకు ట్రెక్కింగ్ చేయడం ఒక ఉత్కంఠభరితమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎత్తైన ప్రదేశం. అలాగే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

మేఘాలయ.. చిరపుంజీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ట్రెక్. ఇవి సహజంగా పెరిగిన చెట్ల వేర్లతో చేసిన వంతెనలు. ఖాసీ తెగ ప్రజలు ఈ వంతెనలను నదులపై నడవడానికి ఉపయోగిస్తారు.

కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్. ఇది కాశ్మీర్ లోయలో ఉన్న ఒక అందమైన, సవాలుతో కూడిన ట్రెక్కింగ్.
Updated at - Jun 23 , 2025 | 06:23 PM