Yemmiganur Jatara: ఎమ్మిగనూరులో జాతర.. కన్నుల పండుగగా రథోత్సవం
ABN, Publish Date - Jan 15 , 2025 | 09:33 PM
Yemmiganur Jatara: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనవరి15వ తేదీ అంటే బుధవారం స్వామి వారి రథోత్సవం ఘనంగా సాగింది. అలాగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేటి నుంచి నెల రోజులపాటు ఈ జాతర జరుపుకొంటారు. దాదాపు3 శతాబ్దాల నుంచి ఈ జాతరను రైతుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో భాగంగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యవసాయం కోసం కోడెలు, ఎద్దులను కొనుగోలు చేస్తారు. ఈ జాతర కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు ఎమ్మిగనూరుకు తరలిరానున్నారు.

ఎమ్మిగనూరులో జాతర సందర్భంగా పుర వీధుల్లో కన్నుల పండుగగా రథోత్సవం

రధోత్సవానికి పోటెత్తిన భక్తులు

గర్భ గుడిలో కొలువు తీరిన నీలకంఠేశ్వర స్వామి. స్వామి వారిని దర్శించుకొంటున్న భక్తులు

శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం. స్వామి వారి రథశాల

స్వామి వారి రథోత్సవాన్ని వీక్షించేందుకు వస్తున్న ఓ కుటుంబం

రథోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు

రథోత్సవాన్ని డాబాలపై నుంచి వీక్షిస్తున్న ఎమ్మిగనూరు ప్రజలు

స్వామి వారి రథోత్సవాన్ని వీక్షిస్తున్న భక్త జన సంద్రం

రథోత్సవం కోసం ఎమ్మిగనూరులో బందోబస్తు కోసం తరలి వచ్చిన పోలీస్ సిబ్బంది

జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరలో రైతులకు విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు

జాతరను మిద్దెల పైనుంచి వీక్షిస్తున్న ఎమ్మిగనూరు ప్రజలు
Updated at - Jan 15 , 2025 | 09:35 PM