Tamannaah Bhatia: విశాఖలో తమన్నా భాటియా అందాల జాతర..
ABN, Publish Date - Mar 09 , 2025 | 08:50 AM
విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో అందాల పోటీలు జరిగాయి. ఈ అందాల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ అందాల పోటీల్లో మోడళ్లను ప్రదర్శనలు చేశారు.

విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో అందాల పోటీలు జరిగాయి.

ప్రముఖ సినీనటి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా శనివారం విశాఖ నగరంలో సందడి చేశారు. రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన ఈ అందాల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ అందాల పోటీల్లో పలువురు మోడళ్లు ప్రదర్శనలు చేశారు.

తమన్నా రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోవడంతో యువత కేరింతలు కొట్టారు. భారీగా హోటల్ వద్దకు చేరుకున్న కుర్రకారు తమన్నాను చూడటానికి ఎగబడ్డారు.

విశాఖలో ఆకట్టుకున్న అందాల పోటీలు

ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహూతులను అలరించింది.

ఈ సందర్భంగా తమన్నా వేదికపై కొద్దిసేపు ర్యాంప్ వాక్ చేసి అలరించారు.

ఈ అందాల పోటీల్లో పలువురు మోడళ్లతో తమన్నా భాటియా పోటీపడి ప్రదర్శనలు ఇచ్చారు.
Updated at - Mar 09 , 2025 | 08:58 AM