TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్

ABN, Publish Date - Nov 04 , 2025 | 07:04 PM

తిరుపతిలోని ఎస్వీ గోశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం,తాగునీరుతోపాటు పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అందుకు సంబంధించిన పలు అంశాలను ఆయనకు ఇంఛార్జ్ డైరెక్టర్ డి.ఫణి కుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను టీటీడీ ఈవో ఏకే సింఘాల్ పరిశీలించారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 1/7

తిరుపతిలోని ఎస్వీ గోశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం,తాగునీరుతోపాటు పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అందుకు సంబంధించిన పలు అంశాలను ఆయనకు ఇంఛార్జ్ డైరెక్టర్ డి.ఫణి కుమార్ నాయుడు వివరించారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 2/7

దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను టీటీడీ ఈవో ఏకే సింఘాల్ పరిశీలించారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 3/7

ఈ సందర్భంగా గోశాలలో ఉన్న గోవుల సంఖ్యను ఆయన అడిగి గెలుసుకున్నారు. దాణా మిక్సింగ్ ప్లాంట్‌లోని పనులను ఆయన ఆసక్తిగా గమనించారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 4/7

అనంతరం అగరబత్తుల యూనిట్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 5/7

గోవుల కోసం నిర్మిస్తున్న భవనంలో కలియ తిరిగారు. నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 6/7

దేవునికి వినియోగించిన పూలతో అగరబత్తులను తయారు చేయడానికి సంబంధించిన అంశాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.

TTD Goshala: ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏకే సింఘాల్ 7/7

అగరబత్తుల ప్యాకింగ్‌ను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. అలాగే అగరబత్తుల తయారీని పరిశీలించారు.

Updated at - Nov 04 , 2025 | 07:06 PM