Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత..

ABN, Publish Date - Sep 07 , 2025 | 06:08 PM

భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలు మూసి వేశారు.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 1/7

భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 7వ తేదీ) రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 2/7

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు అన్ని మూసి వేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ దేవాలయాలన్నీ మూత పడ్డాయి.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 3/7

తిరుమలలోని శ్రీవారి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, సూర్య దేవాలయం, తిరుపతిలోని ముఖ్య దేవాలయాలు గోవిందరాజుల స్వామి ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయం మూసివేశారు.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 4/7

అలాగే విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి వారి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నవరంలోని సత్యదేవుని ఆలయం, సింహచలంలోని శ్రీవారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంతోపాటు పలు ఆలయాలను మూసి వేశారు.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 5/7

ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి అర్థరాత్రి 01 గంట 26 నిమిషాల వరకు ఉంటుంది.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 6/7

అంటే మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఉండనుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలు గ్రహణ మధ్యస్థ కాలంగా జోతిష్య పండితులు నిర్ణయించారు.

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. 7/7

ఈ దేవాలయాలను సోమవారం ఉదయం తిరిగి తెరవనున్నారు. దేవాలయాలను సంప్రోక్షణ అనంతరం భక్తులకు దేవుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.

Updated at - Sep 07 , 2025 | 07:28 PM