TDP Mahanadu 2025: అన్న ఎన్టీఆర్‌కు మహానాడు వేదికగా ఘన నివాళి
ABN, Publish Date - May 28 , 2025 | 11:33 AM
కడప వేదికగా మహానాడు జరుగుతోంది. బుధవారం మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు వేదికగా ఆయనకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పార్టీ నేతలంతా ఘనంగా నివాళులర్పించారు. మే 27వ తేదీన ప్రారంభమైన ఈ మహానాడు రేపటితో.. అంటే మే 29వ తేదీతో ముగియనుంది. ఈ మహానాడుకు లక్షలాది మంది టీడీపీ అభిమానులు హాజరయ్యారు.
1/8
మహానాడు వేదిక ప్రాంగణంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం. ఈ రోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
2/8
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
3/8
మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు
4/8
ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించిన అనంతరం పార్టీ నేతలతో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్
5/8
మహానాడుకు హాజరైన వారికి అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
6/8
వేదిక మీద ఆసీనులైన సీఎం చంద్రబాబు నాయుడు.
7/8
మహానాడులో ప్రసంగిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
8/8
మహానాడులో ప్రసంగిస్తున్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు
Updated at - May 28 , 2025 | 11:33 AM