Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు

ABN, Publish Date - Nov 22 , 2025 | 08:41 PM

సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 1/7

పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 2/7

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 3/7

ఈ విద్యాసంస్థ ద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేర్పుతున్నారని విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యాసంస్థ విలసిల్లుతోందని ఉప రాష్ట్రపతి అన్నారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 4/7

వ్యక్తిత్వ కేంద్రంగా సత్యసాయి వర్సిటీ నిలుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అందరినీ ప్రేమించాలి.. సేవ చేయాలి అనేది భగవాన్‌ సాయి సిద్ధాంతమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 5/7

సత్యసాయి విద్యాసంస్థ నైతికత, విలువలతో కూడి ఉంటుందని, విద్యార్థులకు ఆధ్యాత్మికత, సేవాభావాన్ని విద్యాసంస్థ నేర్పిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 6/7

శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్, శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sri Sathya Sai: ఘనంగా శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవం వేడుకలు 7/7

శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Updated at - Nov 22 , 2025 | 08:41 PM