పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 16 , 2025 | 09:54 PM
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత నియామక పత్రాలు అందజేశారు. మంగళవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి ఈ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
1/11
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత నియామక పత్రాలు అందజేశారు.
2/11
మంగళవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి ఈ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
3/11
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థులు ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమాక పత్రాలు అందుకోవడం పట్ల సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
4/11
అలాగే పోలీసులకు కీలక సూచనలు చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
5/11
కొందరు రాజకీయ ముసుగులో రౌడీయుజం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు.
6/11
ఇటీవల విజయవాడ సమీపంలో పాస్టర్ ప్రమాదవశాత్తు మరణించారన్నారు. ఆయన మృతిపై వివాదాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని పేర్కొ్న్నారు.
7/11
తమ ప్రభుత్వంపై నిందలు సైతం మోపేందుకు ఏ మాత్రం వెనకాడలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్, ఫొటోలతో ద్వారా ఈ ప్రమాదవశాత్తు జరిగిన మరణమని స్పష్టమైందని చెప్పారు.
8/11
ఈ ఆధారాలు లేకుంటే తామే ఈ హత్య చేశామంటూ విమర్శలు వెల్లువెత్తేవని తెలిపారు. ఆ మాత్రం సపోర్ట్ తనవైపు ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
9/11
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పోలీసులు, కానిస్టేబులు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు తరలి వచ్చారు.
10/11
ఈ కార్యక్రమంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులతోపాటు సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెల్పీ దిగారు.
11/11
ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.
Updated at - Dec 16 , 2025 | 10:03 PM