PM Modi Tour in Kurnool: కర్నూలు ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
ABN, Publish Date - Oct 16 , 2025 | 10:39 AM
ప్రధాని మోదీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు తదితరులు కర్నూలు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
1/7
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఆ క్రమంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు.
2/7
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అమరావతి నుంచి కర్నూలు విమానాశ్రయానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు చేరుకున్నారు.
3/7
ఈ పర్యటనలో భాగంగా మరికాసేపట్లో ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకోనున్నారు.
4/7
శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ఆయన గడపనున్నారు. అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
5/7
40 నిమిషాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం, ధ్యాన మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ గడపనున్నారు.
6/7
మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి కర్నూలు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
7/7
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే శ్రీశైలంతోపాటు కర్నూలులో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
Updated at - Oct 16 , 2025 | 10:43 AM