Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు

ABN, Publish Date - Oct 29 , 2025 | 09:56 PM

మొంథా తుపాను తీరం దాటింది. అది క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 1/7

మొంథా తుపాను తీరం దాటింది. అది క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 2/7

అతి భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 3/7

జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. నగరంలోని రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 4/7

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 5/7

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 6/7

తుపాన్ తీరం దాటడంతో.. అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు 7/7

అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనితా ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. దీంతో ప్రమాదం చాలా వరకు నివారించగలిగారు.

Updated at - Oct 29 , 2025 | 10:00 PM