Nara Lokesh: పిల్లలకు ఆటపాటలతోపాటు నైతిక విలువలు నేర్పించాలి: మంత్రి లోకేశ్
ABN, Publish Date - Nov 24 , 2025 | 08:15 PM
పాఠశాలలో పిల్లలకు ఆట పాటలు, చదువుతోపాటు నైతిక విలువలు అందించాలని తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఆటమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశం అంతా ఘనంగా వెలుగుతుందన్నారు. అదే ఆటమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా నాగసాకిలా తయారవుతుందని అన్నారు. సోమవారం విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విలువలు విద్య’ సదస్సులో చాగంటితో కలిసి ఆయన పాల్గొన్నారు.
1/8
పాఠశాలలో పిల్లలకు ఆట పాటలు, చదువుతోపాటు నైతిక విలువలు అందించాలని తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఆటమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశం అంతా ఘనంగా వెలుగుతుందన్నారు. అదే ఆటమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా నాగసాకిలా తయారవుతుందని అన్నారు.
2/8
సోమవారం విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విలువలు విద్య’ సదస్సులో చాగంటితో కలిసి ఆయన పాల్గొన్నారు.
3/8
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.
4/8
పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలుకావాలన్నారు.
5/8
మహిళలకు గౌరవం ఇచ్చినప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్‌ల్లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదన్నారు.
6/8
మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదని యువతకు సూచించారు.
7/8
జీవితంలో అవమానాలు సహజమన్నారు. లక్ష్యంతో పని చేస్తే.. విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
8/8
టీచర్ల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated at - Nov 24 , 2025 | 08:19 PM