ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ

ABN, Publish Date - Sep 05 , 2025 | 04:33 PM

ప్రధాని మోదీతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జీఎస్టీలో కేంద్రం కీలక సంస్కరణలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీని లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 1/6

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 2/6

45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పలు కీలక అంశాలపై మంత్రి లోకేష్ చర్చించారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 3/6

ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 4/6

అలాగే జీఎస్టీ స్లాబ్‌ల హేతుబద్ధీకరణ, సంస్కరణల అమలు నేపథ్యంలో ప్రధాని మోదీని లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 5/6

ప్రత్యేకించి విద్యారంగంలో పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ 6/6

ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్‌లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated at - Sep 05 , 2025 | 04:36 PM