మంగళగిరిలో మోడల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి లోకేశ్
ABN, Publish Date - Nov 27 , 2025 | 10:12 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మంగళగిరిలో మోడల్ పబ్లి్క్ లైబ్రరీని ప్రారంభించారు. ఈ లైబ్రరీని రూ.1.72 కోట్లతో ఆధునీకరించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
1/8
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మంగళగిరిలో మోడల్ పబ్లి్క్ లైబ్రరీని ప్రారంభించారు. ఈ లైబ్రరీని రూ.1.72 కోట్లతో ఆధునీకరించారు.
2/8
1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
3/8
లైబ్రరీ ఆధునీకరణకు సీఎస్ఆర్ ఫండ్స్ కింద గంటూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ రూ. 90 లక్షలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ రూ. 42 లక్షలు, నోవో ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 30 లక్షలు అందించారు.
4/8
లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్‌లో పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ దిన పత్రికలు, వార, మాసపత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్, బుక్ రీడింగ్ రూమ్, సీనియర్ సిటిజన్స్ రీడింగ్ ఏరియా, పబ్లిక్ రీడింగ్ ఏరియా, ఫలహారశాలతో పాటు మొదటి అంతస్తులో రెండు టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, నైపుణ్యంతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ రీసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
5/8
మోడల్ పబ్లిక్ లైబ్రరీ ప్రారంభోత్సవం సందర్భంగా 186లో స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన శిలాఫలకం వద్ద మంత్రి నారా లోకేశ్ సెల్ఫీ దిగారు. లైబ్రరీ మొత్తం కలియతిరిగి.. సౌకర్యాలను పరిశీలించారు.
6/8
ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ ఎస్ రాజశేఖర్, పద్మశాలీ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్ధయ్య, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతోపాటు స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
7/8
లైబ్రరీ ప్రాంగణంలో నారా లోకేశ్ మొక్కను నాటారు.
8/8
ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.
Updated at - Nov 27 , 2025 | 10:12 PM