Hyderabad - Bangalore Bus Fire Accident: బస్సు దగ్ధం.. 20 మందికిపైగా సజీవ దహనం
ABN, Publish Date - Oct 24 , 2025 | 09:14 AM
కర్నూలు జిల్లా కల్లూరు సమీపంలోని చిన్నటేకూరు గ్రామ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా సజీవ దహనమయ్యారు. మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.
1/6
కర్నూలు జిల్లా కల్లూరు సమీపంలోని చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టి.. ముందుభాగంలోకి దూసుకెళ్లింది.
2/6
దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు సజీవ దహనమయ్యారు.
3/6
ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో 20 మందికిపైగా మృతి చెందారు. మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.
4/6
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు శివారులోని ఉలిందకొండ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి.. బస్సు అంతా మంటలు వ్యాపించాయి.
5/6
దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకుని గట్టిగా అరుస్తూ అత్యవసర ద్వారం ద్వారా బయటకు దూకారు. పలువురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనపై ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారంత బస్సు దగ్ధమైన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
6/6
గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో అత్యధికులు హైదరాబాద్‌కు చెందిన వారని తెలుస్తుంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Updated at - Oct 24 , 2025 | 09:16 AM