Karthika Maasam: కార్తీక రెండో సోమవారం.. పుష్కర ఘాట్‌కు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 03 , 2025 | 04:17 PM
పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. కార్తీకం. ఈ మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి.. పుణ్య దినాలు. ఆ క్రమంలో నవంబర్ 3వ తేదీ.. కార్తీక మాసం రెండో సోమవారం. ఈ రోజు తెల్లవారు జామున రాజమండ్రిలోని గోదావరి నదీ ఒడ్డున ఉన్న పుష్కర్ ఘాట్‌కు భక్తులు పోటెత్తారు.
1/8
పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. కార్తీకం. ఈ మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి.. పుణ్య దినాలు. ఆ క్రమంలో నవంబర్ 3వ తేదీ.. కార్తీక మాసం రెండో సోమవారం.
2/8
ఈ రోజు తెల్లవారు జామున రాజమండ్రిలోని గోదావరి నదీ ఒడ్డున ఉన్న పుష్కర్ ఘాట్‌కు భక్తులు పోటెత్తారు.
3/8
తెల్లవారుజామున గోదావరిలో కార్తీక స్నానం ఆచరించి.. నదిలోకి దీపాలు వదిలారు.
4/8
ఈ మాసంలో నదీస్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించి.. వాటిలోకి దీపాలు వదిలితే.. సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.
5/8
ఇక పుష్కర్ ఘాట్, ఆ పక్కనే ఉన్న కోటిలింగాల ఘాట్‌లు శివ నామస్మరణతో మార్మోగాయి.
6/8
కార్తీక మాసం అందునా.. రెండో సోమవారం కావడంతో భక్తులు భారీగా రాజమండ్రిలోని ఘాట్‌లకు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
7/8
అలాగే ఘాట్ సమీపంలోని శివాలయంలో పరమ శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు సైతం భక్తులు నిర్వహించారు.
8/8
అందుకోసం పుష్కర్ ఘాట్ సమీపంలోని ఆలయాల వద్ద క్యూ లైన్లు బారులు తీరాయి.
Updated at - Nov 03 , 2025 | 04:21 PM