CM Chandrababu: ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:06 PM
అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 17 నెలల్లో ఇళ్లు పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వారికి న్యాయం చేసేందుకు పని చేస్తామని హమీ ఇచ్చారు.
1/12
అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
2/12
17 నెలల్లో ఇళ్లు పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వారికి న్యాయం చేసేందుకు పని చేస్తామని హమీ ఇచ్చారు.
3/12
ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్క పక్కనే రెండు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
4/12
ఇళ్లపైనే కాకుండా.. పొలాల్లో సైతం కరెంట్ తయారు చేయిస్తున్నామని వివరించారు. సోలార్, విండ్, వాటర్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
5/12
ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.
6/12
నిన్న అంటే నవంబర్ 10వ తేదీన కనిగిరిలో 97 పరిశ్రమలు ప్రారంభించామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు.
7/12
ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. 2029 నాటికి పేదలకి సొంతిల్లు ఉండాలనేది తన లక్ష్యమని ప్రకటించారు.
8/12
ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్‌కు భద్రత అని అభివర్ణించారు.
9/12
జగన్ రెడ్డి ఐదేళ్లలో ఏపీని నాశనం చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించారు. ఏపీని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
10/12
కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా జగన్ పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుంటే ఏపీకే నష్టమని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వక పోవడం వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారని మండిపడ్డారు.
11/12
ఇళ్ల నిర్మాణ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే ఇసుకలోనూ జగన్, ఆయన అనుచరులు దోచుకున్నారని ఆక్షేపించారు.
12/12
ముస్లింలకు కూడా అందరితో సమానంగా ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నాటికి 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated at - Nov 12 , 2025 | 06:07 PM