Cyclone Alert: తుఫాను హెచ్చరిక.. ధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తుతున్న రైతులు
ABN, Publish Date - Nov 26 , 2025 | 10:01 PM
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో రాజోలు వద్ద జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు సంచులలోకి ఎత్తి జాగ్రత్త పరుచుకుంటున్నారు.
1/6
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో రాజోలు వద్ద జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు సంచులలోకి ఎత్తి జాగ్రత్త పరుచుకుంటున్నారు.
2/6
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, భూమధ్యరేఖ హిందూ మహా సముద్రం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది.
3/6
అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది.
4/6
ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇది ఉత్తర పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది.
5/6
ఈ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వివరించింది.
6/6
డిసెంబర్ 1వ తేదీన కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతే కాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు సూచించింది. మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్ తుఫాన్ ఇండోనేషియా వద్ద తీరం దాటిందని వివరించింది. ఇది క్రమంగా బలహినపడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Updated at - Nov 26 , 2025 | 10:01 PM