CM Chandrababu: చంద్రబాబు సమీక్ష.. అధికారులపై సీరియస్
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:30 PM
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై చంద్రబాబు రివ్యూ..

పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై చంద్రబాబు ఆరా..

పలు పథకాల లబ్ధిదారుల గుర్తింపు విషయంలో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు..

ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
Updated at - Jan 27 , 2025 | 04:37 PM