CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 07 , 2025 | 09:05 PM

గుంటూరు లామ్‌లో ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పద్మ విభూషణ్ ఆచార్య ఎన్.జి.రంగా 125వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆచార్య ఎన్జీ రంగా కేవలం 33 ఏళ్ల వయసులోనే ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి.. వారికి శిక్షణ అందించారని వివరించారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 1/11

గుంటూరు లామ్‌లో ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పద్మ విభూషణ్ ఆచార్య ఎన్.జి.రంగా 125వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 2/11

అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆచార్య ఎన్జీ రంగా కేవలం 33 ఏళ్ల వయసులోనే ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి.. వారికి శిక్షణ అందించారని వివరించారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 3/11

ఒక వైపు దేశం కోసం మరో వైపు రైతుల కోసం ఆచార్య ఎన్జీ రంగా పోరాడారని తెలిపారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 4/11

ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యత సాధించిన రంగా.. మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 5/11

స్వాతంత్ర్య పోరాటం కోసం జరిగిన పలు ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారన్నారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 6/11

ఆచార్య ఎన్జీ రంగా పార్లమెంట్‌లో ఉన్నంత కాలం రైతులు సుభిక్షంగా ఉంటారంటూ మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 7/11

ఆచార్య ఎన్జీ రంగా చేసిన పోరాటాలకు పద్మ విభూషణ్‌తో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. తాను మొదటిసారి సీఎం కాగానే వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఆచార్య ఎన్జీ రంగా పేరు పెట్టానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 8/11

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత యూనివర్సిటీ పేరు మార్చారన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్ జీ రంగా పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 9/11

ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి.. వందేమాతరం 150 వసంతాల వేడుకలు ఒకే రోజు రావటం ఒక చరిత్ర అని అభివర్ణించారు. ప్రాంతాలకు అతీతంగా నాలుగుచోట్ల ఎంపీగా గెలిచిన చరిత్ర ఆచార్య ఎన్జీ రంగాదంటూ సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 10/11

ఈ ఉత్సవాలను ఎన్ జీ రంగా ట్రస్ట్ నిర్వహించింది.

CM Chandrababu Naidu: ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు 11/11

ఈ ఉత్సవాలకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఎన్ జీ రంగా కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ఎన్ జీ రంగా ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు.

Updated at - Nov 07 , 2025 | 09:05 PM