సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు

ABN, Publish Date - Sep 16 , 2025 | 02:14 PM

రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం.. సెప్టెంబర్ 16తో అంటే.. ఈరోజుతో ముగియనుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 1/10

రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సు మంగళవారం రెండో రోజు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో తొలుత స్వచ్ఛంధ్రాపై పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పారిశుద్ధ్యం, ప్రజా అవగాహన తదితర కీలక అంశాలను ఆయన వివరించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 2/10

అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. మొదటిసారి సింగపూర్‌ వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యయనం చేశానని చెప్పారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 3/10

హైదరాబాద్‌లో నైట్‌ క్లీనింగ్‌ ప్రారంభించామని గుర్తు చేశారు. పొరుగు సేవల సిబ్బంది నియామకం కూడా అదే తొలిసారి అని వివరించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 4/10

ప్రధాని తనకు అవకాశమిస్తే స్వచ్ఛభారత్‌ రిపోర్టు సైతం ఇచ్చానన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను ఉద్యమంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 5/10

ఒకప్పుడు ఆనంద ఆదివారం కూడా పెట్టామని తెలిపారు. ఎవరికి ఏ ప్రతిభ ఉంటే దాన్ని బయటపెట్టేవాళ్లమని పేర్కొన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలు వచ్చాయని చెప్పారు. లాఫింగ్‌ సొసైటీ, షౌటింగ్‌ సొసైటీలు వస్తున్నాయని వివరించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 6/10

సర్క్యులర్‌ ఎకానమీ పాలసీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సాలిడ్‌ లిక్విడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌‌పై దృష్టి పెట్టాలని సూచించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 7/10

ముఖ్యంగా డ్రైన్లు శుభ్రం చేయాల్సి ఉంటుందన్నారు. వర్షపు నీరు, ఇళ్లలోకి నీరు వస్తే ఇంకిపోయేలా టెక్నాలజీ తీసుకొచ్చారని తెలిపారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 8/10

ఏపీలో అన్ని నగరాలు స్వచ్ఛ అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఏళ్లుగా పేరుకు పోయిన చెత్తను జనవరి 1లోగా తొలగించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 9/10

17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.5 సర్క్యులర్‌ ఎకానమీ పార్కులు పెడతాని సీఎం చంద్రబాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు 10/10

రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం సోమవారం సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఈ సమావేశం ఈ రోజు అంటే.. మంగళవారంతో ముగియనుంది.

Updated at - Sep 16 , 2025 | 02:19 PM