Cyclone Montha: కోనసీమ జిల్లాలో వరి భూములను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Oct 29 , 2025 | 05:29 PM
మొంథా తుపాను పెను విపత్తుని.. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఆ క్రమంలో ఆరగట్లపాలెం గ్రామంలోని వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు.
1/5
మొంథా తుపాను పెను విపత్తుని.. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.
2/5
అనంతరం రోడ్డు మార్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఆ క్రమంలో ఆరగట్లపాలెం గ్రామంలోని వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు.
3/5
ఈ సందర్భంగా స్థానిక రైతులు, అధికారులతో ఆయన మాట్లాడారు. అలాగే అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి.. తుపాను బాధితులను ఆయన పరామర్శించారు.
4/5
ఈ సందర్భంగా బాధితులకు నిత్యవసర వస్తువులు, పరిహారం అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు.
5/5
గతంలో తుపానుల సమయంలో పని చేసిన అనుభవం తనకు ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ నష్టం లేకుండా చూశామన్నారు. ఆస్తి నష్టం సైతం చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆస్తి నష్టంపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Updated at - Oct 29 , 2025 | 10:00 PM