బిజీబిజీగా సీఎం చంద్రబాబు.. ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుస భేటీలు
ABN, Publish Date - Dec 19 , 2025 | 05:33 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. ఆయన ఎవరెవరిని కలిశారు? ఏమేం చర్చించారో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర పెద్దలతో వరుసగా భేటీలు నిర్వహించారు.
2/5
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు. మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు.
3/5
ఈ నేపథ్యంలోనే బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌ని సీఎం చంద్రబాబు మార్యదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
4/5
అలాగే, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా చేయూత అందించాలని కోరారు.
5/5
అంతేకాకుండా, కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు.
Updated at - Dec 19 , 2025 | 05:39 PM