National Handloom Day: నేతన్నలకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని: సీఎం చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:40 PM
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం (ఆగస్ట్ 07) మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి సవిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1/13
రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
2/13
గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
3/13
ఈ సందర్భంగా సీఎ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలని పేర్కొన్నారు.
4/13
నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలని ఆయన అభివర్ణించారు. నేతన్నలకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత నందమూరి తారక రామారావు అని తెలిపారు.
5/13
వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని వివరించారు. 55, 500 మంది చేనేత కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున రూ. 27 కోట్లు రుణాలుగా అందించామన్నారు.
6/13
అలాగే 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.
7/13
చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛన్ అందించాలని నిర్ణయించామన్నారు. చిన్న వయస్సులోనే నేతన్నలు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉందన్నారు.
8/13
అందుకే 50 ఏళ్లకే పింఛన్ తీసుకొచ్చామని వివరించారు. 50 శాతం సబ్సిడీతో మర మగ్గాలకు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.
9/13
ఆగస్ట్ 2025 నుంచి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇఖ మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు.
10/13
ఈ ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చేనతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు.
11/13
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... తాము కుటుంబపరంగా ఏదైనా శుభకార్యానికి హాజరైతే అక్కడ వారికి చేనేత వస్త్రాలనే అందజేస్తున్నామని చెప్పారు. తమ కుటుంబం చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని నేతన్నలకు హామీ ఇచ్చారు.
12/13
ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
13/13
ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎంపీ సుచిత్రా ఎల్లా సైతం పాల్గొన్నారు.
Updated at - Aug 07 , 2025 | 09:40 PM