Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు

ABN, Publish Date - Oct 03 , 2025 | 08:20 PM

చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నడి రోడ్డుపై ఊరేగిస్తూ.. కోర్టకు తరలించారు.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 1/6

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు కిశోర్, మహేశ్, హేమంత్‌లను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 2/6

ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి.. పోలీస్ స్టేషన్‌ నుంచి కోర్టు వరకు దాదాపు కిలోమీటర్ మేర నడి రోడ్డుపై నడిపించి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు సదరు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 3/6

సెప్టెంబర్ 25వ తేదీన మంగసముద్రంకు చెందిన హేమంత్, మురకంబుట్ట అగ్రహారానికి చెందిన కిశోర్, మహేశ్‌లు.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారించారు.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 4/6

అయితే పూతలపట్టు మండలంలో పార్కు‌కు వచ్చే ప్రేమ జంటలను బెదిరించి.. వారి వద్ద నుంచి వీరు నగలు, నగదు దోచుకెళ్లే వారని ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 5/6

దీంతో నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని.. అందులోని చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాల్లో చదువుతున్నారు.

Chittoor District: అత్యాచార నిందితులకు బేడీలు.. నడి రోడ్డుపై ఊరేగింపు 6/6

ఈ నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 మంది విధులు నిర్వహిస్తున్నారని.. వారిలో 14 మంది డిప్యూటేషన్‌పై వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం 13 మంది సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Oct 03 , 2025 | 08:21 PM