గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు..

ABN, Publish Date - Oct 09 , 2025 | 10:09 PM

అట్లతద్ది నోముల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌కు మహిళలు భారీగా తరలి వచ్చి.. నోములు తీర్చుకున్నారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 1/6

తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద అట్లతద్ది సందర్భంగా మహిళలు నోములు తీర్చుకున్నారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 2/6

ఈ సందర్భంగా భారీగా మహిళలు స్థానిక పుష్కర ఘాట్లకు తరలి వచ్చారు. ఆ క్రమంలో నది తీరంలో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 3/6

అట్లతద్ది సందర్భంగా మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 4/6

యువతులు మంచి భర్త రావాలని.. అలాగే వివాహిత మహిళలు.. నిండూ నూరేళ్లు ముత్తైదువులుగా ఉండాలని పూజలు చేశారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 5/6

అట్లతద్ది సందర్భంగా ఉదయం నుంచి భక్తులు భారీగా నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు.. 6/6

సాయంత్రం పుష్కరఘాట్ల వద్దకు చిన్నారుల నుంచి అవ్వల వరకు అంతా గోదావరి వద్దకు చేరుకుని.. ఆట పాటలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.

Updated at - Oct 09 , 2025 | 10:09 PM