Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే..

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:34 PM

Nara Lokesh Delhi visit: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగింది. ఉపరాష్ట్రపతి మొదలుకుని పలువురు కేంద్రమంత్రులతో వరస భేటీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఏపీ అభివృద్ధి, రాష్ట్రంలో పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 1/6

ఢిల్లీ పర్యటనలో ముందుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా భేటీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 2/6

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో కూటమి ప్రభుత్వ విజయాలు, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 3/6

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో జరిగిన సమావేశంలో ప్రధానంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందించారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 4/6

కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిగిన భేటీలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు చేయాలని కోరారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 5/6

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని గురించి వివరించారు. జూలై 5 న జరిగే మెగా పిటిఏం కార్యక్రమానికి హాజరుకావాలని ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆహ్వానించాను. ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరగా, అందుకు మంత్రి అంగీకరించారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అయ్యారంటే.. 6/6

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.

Updated at - Jun 19 , 2025 | 12:48 PM