సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు

ABN, Publish Date - Feb 28 , 2025 | 10:02 PM

Anantapur police: మొబైల్ ఫోన్ల రికవరీలో 11 వేల మైలురాయిని అనంతపురం జిల్లా పోలీసులు దాటారు. ఈ రోజు అంటే ఫిబ్రవరి 28వ తేదీన అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ల రికవరీ మేళాలో 1,183 ఫోన్లను బాధితులను అందజేశారు. సెల్ ఫోన్ల రికవరీ చేసి.. బాధితులకు అందించడంలో అనంతపురం జిల్లా పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇక దొరకవని ఆశలు వదులుకొన్న సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకున్న బాధితుల్లో అనందం వెల్లివిరిసింది. జిల్లా పోలీసుల సేవలు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 1/7

మొబైల్ ఫోన్ల రికవరీలో 11 వేల మైలురాయిని అనంతపురం జిల్లా పోలీసులు దాటారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 2/7

ఫిబ్రవరి 28వ తేదీన అందజేసిన 1,183 ఫోన్లతో కలిపి ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 11,378. వీటి విలువ సుమారు రూ 21.08 కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 3/7

అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ అంకితభావంతో.. సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే ఈ జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 4/7

అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రికవరీ మొబైల్ ఫోన్ల మేళాలో రూ.2.95 కోట్ల విలువ చేసే 1,183 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అందజేశారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 5/7

రికవరీ అయిన సెల్ ఫోన్లను పరిశీస్తున్న జిల్లా ఎస్పీ జగదీష్

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 6/7

రికవరీ అయిన సెల్ ఫోన్లు.. బాధితులకు అందజేసేందుకు సిద్దంగా ఉంచారు.

సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన అనంతపురం పోలీసులు 7/7

అనంతపురంలోని పోలీస్ గ్రౌండ్స్ చేరుకున్న సెల్ ఫోన్ పోయిన వారు.

Updated at - Feb 28 , 2025 | 10:04 PM