Share News

Vivek Ramaswamy: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి!

ABN , Publish Date - Jan 21 , 2025 | 10:53 PM

అమెరికా డోఓజీఈ శాఖ బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఒహాయోలో జరిగే ఎన్నికల్లో ఆయన పాల్గొంటారన్న వార్తల నడుమ తాను డీఓజీఈ నుంచి తప్పుకుంటున్నట్టు వివేక్ ఓ ప్రకటన చేశారు.

Vivek Ramaswamy: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా డీఓజీఈ శాఖ బాధ్యతల నుంచి వివేక రామస్వామి తప్పుకున్నారు. ఒహాయో రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో తను పోటీపడొచ్చన్న వార్తల నడుమ వివేక్ ఈ ప్రకటన చేశారు. ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం డీఓజీఈ శాఖ ప్రతినిధి..వివేక్ తప్పుకుంటున్న విషయాన్ని పేర్కొన్నారు.

‘‘ఈ శాఖ ఏర్పాటులో వివేక్ రామస్వామి కీలక పాత్ర పోషించారు. అయితే, ఆయన త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తు్న్నారు. ఫలితంగా, డీఓజీఈ శాఖకు ఆవల ఆయన వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి, గత రెండు నెలలుగా ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు’’ అని శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

H-1b Visa: ట్రంప్ నిర్ణయాలతో భారతీయుల్లో పతాకస్థాయికి టెన్షన్!

కాగా, ఈ విషయమై వివేక్ రామస్వామి కూడా స్పందించారు. ‘‘డీఓజీఈ శాఖ ఏర్పాటులో పాలు పంచుకోవడం నాకెంతో గర్వకారణం. ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సులువుగా సాగేలా చేయడంలో ఎలాన్ ఆయన టీం విజయం సాధిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఒహాయోలో నా ప్రణాళికల గురించి త్వరలో వెల్లడిస్తాను. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు ట్రంప్‌కు మనందరం సహకరించాలి’’ అని వివేక్ పేర్కొన్నారు.


Revanth Reddy: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో తెలంగాణ సీఎంతో ‘మీట్ అండ్ గ్రీట్

అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సమర్థవంతగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్న్‌మెంట్ ఎఫిషియన్సీ పేరిట ఓ కొత్త విభాగాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ శాఖ పగ్గాలను ఎలాన్ మస్క్‌తో పాటు వివేక్ రామస్వామికి అప్పటించారు. తాజాగా వివేక్ రామస్వామి తప్పుకోవడంతో ఇకపై ఈ శాఖ బాధ్యతలను పూర్తిగా మస్క్ నిర్వహిస్తారు.

NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’


కాగా, ప్రభుత్వ నిర్వహణలో ఖర్చులు తగ్గించుకునే దిశగా సలహాలు ఇచ్చేందుకు ఓ అడ్వైజరీ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ట్రంప్ సోమవారం తెలిపారు. ప్రభుత్వం వినియోగిస్తున్న సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌లను ఆధునికీకరించేందుకు ఈ బృందం సలహాలు ఇవ్వనుంది. ఈ గ్రూప్‌ కోసం కొత్త 20 మందిని నిమించుకోనున్నట్టు కూడా ట్రంప్ తెలిపారు. అయితే, డోజ్ శాఖ, సలహా బృందాలకు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రజాహిత సంఘాల నుంచి న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి.

TPAD: యూఎస్ఏలో వైభవంగా తెలంగాణ పీపుల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

Read Latest and NRI News

Updated Date - Jan 21 , 2025 | 10:54 PM