Share News

Dublin: డబ్లిన్‌లో వాసవి మాత అగ్ని ప్రవేశ దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:22 PM

శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్లిన్‌డబ్లిన్‌లో వాసవి మాత అగ్ని ప్రవేశ దినోత్సవ వేడుకలులో ఎన్నారైలు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Dublin: డబ్లిన్‌లో వాసవి మాత అగ్ని ప్రవేశ దినోత్సవ వేడుకలు

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రితకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వంద మందికి పైగా వాసవి మాత భక్తులు, కార్యక్రమ నిర్వాహక సభ్యులందరు కలిసి స్థానిక వీహెచ్‌సీసీఐ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కోసం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. తరువాత అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనము, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు (NRI).


BATA: అంగరంగ వైభవంగా ‘బాటా’ సంక్రాంతి సంబరాలు!

తరువాత కార్యక్రమంలో హాజరైన భక్తులందరికీ కార్యక్రమ స్పాన్సర్స్ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికీ భోజనాలను వడ్డించారు.

కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే మరియు వెంకట్ జూలూరిలకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య, దివ్య, లావణ్య, రేణుక, శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.

2.jpg


NRI: ఖతర్ ప్రవాసీ భారతీయ సంఘాల ఎన్నికలలో తెలుగు తమ్ముళ్ల తంటాలు

తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ, మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు.

చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా పాల్గొన్న నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు.

3.jpgRead Latest and NRI News

Updated Date - Feb 01 , 2025 | 05:22 PM