Share News

DOGE: డోజ్ శాఖ ఉద్యోగి రాజీనామా! భారతీయులపై జాత్యాహంకారం ప్రదర్శించి..

ABN , Publish Date - Feb 07 , 2025 | 09:49 PM

భారతీయులపై జాత్యాహంకార విషయం కక్కిన డోజ్ శాఖ ఉద్యోగి మార్కో ఎలేజ్ చివరకు రాజీనామా చేశాడు. గతంలో అతడు చేసిన వ్యాఖ్యలు తాజాగా శ్వేత సౌధం దృష్టికి రావడంతో అతడు తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

DOGE: డోజ్ శాఖ ఉద్యోగి రాజీనామా! భారతీయులపై జాత్యాహంకారం ప్రదర్శించి..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులపై గతంలో సోషల్ మీడియా వేదికగా జాత్యాహంకారం ప్రదర్శించిన డోజ్ శాఖ యువ ఉద్యోగి మార్కో ఎలెజ్ (25) రాజీనామా చేశారు. ఆయన విద్వేష కామెంట్స్ గురించి బయటకు రావడంతో చివరకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. గతేడాది సోషల్ మీడియా వేదికగా అతడీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తరువాత వాటిని తొలగించిన ఇన్నాళ్లకు పాత విషయాలు వెలుగులోకి రావడంతో డోజ్ శాఖ నుంచి అతడు తప్పుకోవాల్సి వచ్చింది (NRI).

Indians in Foreign Countries: విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల కోసం కొత్త చట్టం తేనున్న కేంద్రం!


ప్రభుత్వ కార్యకలాపాల ఉత్పాదకత పెంచుతూ ఖర్చులు తగ్గించుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ డోజ్ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రస్తుతం ఎలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ శాఖలో మార్కో ఎలెజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. మస్క్‌కు అతడు సన్నిహితుడని కూడా అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఎలేజ్ ఎక్స్‌తో పాటు స్పేస్ ఎక్స్‌తో కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సేవలందించాడు. ప్రముఖ అమెరికన్ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ అతడి రాజీనామా గురించి తొలిసారిగా ప్రచురించింది. భారతీయులపై అతడి జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది.

SATA: సౌదీలో ఇద్దరు ఆంధ్రులను ఆదుకున్న మానవతామూర్తులు


గతేడాది సెప్టెంబర్‌లో మార్కో ఓ పోస్టులో జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు చేశాడు. భారతీయులపై ద్వేషం సర్వ సాధారణం కావాలని అన్నాడు. హెచ్-1బీ వీసా ఉన్న భారతీయులు వెనక్కు మళ్లుతున్నారని ఆందోళన చెందవొద్దని మరో పోస్టులో పేర్కొన్నాడు. గతంలో కూడా జాత్యాహంకారిగానే ఉన్నానని మరో సందర్భంలో కామెంట్ చేశాడు. యూజెనిక్స్ ఆధారిత వలస విధానాలను రూపకల్పన చేయాలని కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ విషయాలు ఇటీవల శ్వేత సౌధం దృష్టికి వెళ్లాయట. దీంతో, మార్కో రాజీనామా చేయకతప్పలేదని తెలిసింది.

ఇప్పటికే అమెరికా ట్రెజరీ లావాదేవీల పరిశీలనను డోజ్ శాఖకు అప్పగించారు. దీంతో, లక్షలాది మంది అమెరికన్ల సున్నితమైన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్చో చూసి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నన్నాయి.

Read Latest and NRI News

Updated Date - Feb 07 , 2025 | 09:53 PM