Share News

Russian Woman In India: భారత్ నా జీవితాన్నే మార్చేసింది.. రష్యా మహిళ కితాబు

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:44 PM

పదకొండేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఓ రష్యా మహిళ ఈ దేశం సూపర్ అంటూ కితాబునిచ్చింది. ఇక్కడి వారి ఆతిథ్యం, స్నేహశీలతకు తిరుగులేదని పేర్కొంది. ఈ మేరకు మహిళ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Russian Woman In India: భారత్ నా జీవితాన్నే మార్చేసింది.. రష్యా మహిళ కితాబు
Russian woman Bengaluru

ఇంటర్నెట్ డెస్క్: పదకొండేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఓ రష్యా వనిత ఈ అనుభవం తన జీవితాన్నే మార్చేసిందని నెట్టింట పోస్టు పెట్టింది. భారత్ సూపర్ అంటూ కితాబునిచ్చింది. ఇక్కడి వారి ఆతిథ్యం, గౌరవ మర్యాదలకు సాటి లేదని వ్యాఖ్యానించింది.

బెంగళూరులో ఉంటున్న లూలియా అస్లమోవా ఇన్‌స్టాలో ఈ పోస్టు పెట్టింది. కేవలం ఒక సంవత్సరం ఉండటానికి వస్తే ఏకంగా 11 ఏళ్లు గడిచిపోయాయని తెలిపింది. ఇక్కడి అనుభవాలు తన వ్యక్తిత్వాన్ని ఎంతో మలిచాయని పేర్కొంది. తనని తాను భారత దేశ కోడలిగా చెప్పుకునే ఆమెకు ఇన్‌స్టాలో 22 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు (Russian woman In Bengaluru).

‘ఇక్కడి జనాల్లో అవతలి వారి పట్ల ఆదరణ ఎక్కువ. మంచి మనసుతో స్పందిస్తారు. సాయం చేస్తారు. ఎవరిని అడిగినా సంతోషంగా చేతనైన సాయం చేస్తారు. ఈ దేశంలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఇక్కడ మీరు మనసులో ఏది అనుకుంటే అది సాక్షాత్కారం అవుతుంది. వాస్తవ రూపం దాలుస్తుంది. నా స్నేహితులు ఎందరో భారత్‌ గురించి ముందస్తు అభిప్రాయాలు ఏర్పరచుకుని వచ్చి చివరకు ఇక్కడ ఇమడలేక వెళ్లిపోయారు. కానీ భారతీయ సౌందర్యం, ఇక్కడ లభించే ఆతిథ్యం నేను చూడగలిగాను. ఈ దేశం చాలా సురక్షితమైనది’ అని చెప్పుకొచ్చింది.


ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. భారత దేశ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రశంసించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశం గొప్పదనం ఇదేనని కొందరు అన్నారు. లైఫ్‌లో మంచి భాగస్వామి దొరికితే ఇలాగే ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. ఆమె మరింత కాలం పాటు ఇండియాలో ఉండాలని కూడా ఆకాంక్షించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఆమె అభిప్రాయాల్ని మీరూ ఓమారు ప్రత్యక్షంగా చూడండి.


ఇవి కూడా చదవండి:

బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు

డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్

Read Latest and Viral News

Updated Date - Sep 08 , 2025 | 09:50 PM