Share News

US Visa Crackdown: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలో జాబ్ అంటేనే భయం వేస్తోందంటున్న చైనా స్టూడెంట్స్

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:19 PM

వీసాలపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో చైనా విద్యార్థులు వణికిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా చైనా యువకుడు చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

US Visa Crackdown: ట్రంప్ ఎఫెక్ట్..  అమెరికాలో జాబ్ అంటేనే భయం వేస్తోందంటున్న చైనా స్టూడెంట్స్
U.S. visa crackdown

ఇంటర్నెట్ డెస్క్: వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమెరికాలోని చైనా విద్యార్థులను టార్గెట్ చేసుకుంది. చైనా విద్యార్థులకు ఇచ్చిన వీసాల రద్దులను వేగవంతం చేస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా విద్యార్థులు వణికిపోతున్నారు. అమెరికాలో కెరీర్‌కు ఇక దారులన్నీ మూసుకుపోయినట్టే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి తన ఆందోళనను నెట్టింట పంచుకున్నాడు.


‘నాకిప్పుడు 30 ఏళ్లు. టీనేజ్‌లో ఉండగా అమెరికాలో బోర్డింగ్ స్కూల్లో చేరేందుకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేయాలంటేనే భయంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీట్లేదు. అమెరికాలో చదువు, పని అనుభవం కోసం అనేక మంది విదేశీ విద్యార్థులు వస్తుంటారు. కాస్త అనుభవం గడించాక సొంత దేశాలకు వెళ్లిపోదామనుకుంటారు. మరికొందరు ఇక్కడే ఉండి తమ కంటూ గొప్ప కెరీర్‌ను నిర్మించుకుంటారు. కానీ ఈ మార్గాలన్నీ భవిష్యత్తులో మూసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. విదేశీ విద్యార్థులు తమ ప్లాన్‌లను మార్చుకోవాలేమో’ అని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు.


ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు వీసాల జారీని మరింత కట్టుదిట్టం చేసేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇవి కాక విదేశీ విద్యార్థులను అమెరికాలో జాబ్‌ చేసేందుకు అనుమతించే ఓపీటీ విధానాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉంది. ఈ విషయాన్ని అమెరికా వలసలు పౌరసత్వ సేవల శాఖ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో 1.1 మిలియన్ మంది విదేశీ విద్యార్థులు ఉండగా వారిలో 2.4 లక్షల మంది ఓపీటీపై ఉన్నారు. వీరందరికీ పీజీ తరువాత ఒక సంవత్సరం పాటు అమెరికాలో తమ చదువుకు సంబంధించిన రంగాల్లో పని చేసే అవకాశం ఉంది. ఇక స్టెమ్ విద్యార్థులు మూడేళ్ల వరకూ ఓపీటీపై అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి

విధివంచితుడయిన తెలుగు ఫుడ్ డెలివరీ బాయ్‌కి అండగా సాటా సెంట్రల్

ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం

For National News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 02:31 PM