USA: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఉత్తర అమెరికా పర్యటన
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:55 PM
శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వచ్చే నెలలో ఉత్తర అమెరికాలో పర్యటించనున్నారు.

శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వచ్చే నెలలో ఉత్తర అమెరికాలో పర్యటించనున్నారు. మర్చి 20 నుంచి మే 13 వరకూ ఆయన అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు కెనడాలోనూ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రవచనాలు, సప్తాహాలతో పాటు రక్త దాన శిబిరాలు, ఫుడ్ క్యాంప్ వంటి సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. మరిన్ని వివరాల కోసం vaddipartipadmakar.org. వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు (NRI).
Oman: గల్ఫ్ ఎడారి ఒయాసిస్‌లో వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం
వేదాలు, పురాణాలపై అనేక ప్రసంగాలు చేసిన ప్రవచనకర్తగా, కవిగా, ఆధ్యాత్మిక మార్గదర్శికగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తెలుగువారికి సుపరిచితులు. ఏడు ఖండాల్లో, మూడు భాషల్లో అవధానం చేసి త్రిభాషామహాసహస్రావధాని, సప్తఖండ అవధాన సార్వభౌమ బిరుదులను పొందారు. శ్రీప్రణవ పీఠం నెలకొల్పి తన ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షల మందికి మార్గదర్శిగా నిలిచారు.