H-1b Registrations: హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్‌లో 38 శాతం మేర తగ్గుదల!
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:38 PM
అమెరికా వీసాకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్యలో ఈసారి ఏకంగా 38 శాతం తగ్గుదల నమోదైనట్టు తెలిసింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్-1బీ వీసా వ్యవస్థలో తెచ్చిన మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు (NRI). వీసా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు తెచ్చిన ఈ మార్పుల కారణంగా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మారు 38 శాతం మేర తగ్గినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Drop in H-1b Visa Registrations).
మునుపటి నిబంధనల ప్రకారం, ఒక్కో లబ్దిదారుడి కోసం పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇది లబ్ధిదారులకు వీసా వచ్చే అవకాశాలు గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక మార్పు చేసింది. ఒక లబ్దిదారుడిపై ఒకే రిజిస్ట్రేషన్‌ను అనుమతిస్తామని పేర్కొంది. సదరు అభ్యర్థికి ఎన్ని సంస్థల మద్దతున్నా దరఖాస్తు మాత్రం ఒకటే ఉంటుందని స్పష్టం చేసింది. వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు ఈ మార్పు తెచ్చినట్టు వెల్లడించింది.
Vivek Ramaswamy DOGE: మిమ్మల్ని మస్క్ తొలగించారా అన్న ప్రశ్నకు వివేక్ రామస్వామి సమాధానం ఏంటంటే..
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరత్వ, వలసల శాఖ వద్ద 479,953 రిజిస్ట్రేషన్లు అందాయి. అంతకుమునుపు నమోదైన 758,994 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఈసారి వీటి సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక ఈసారి వచ్చిన వాటిల్లో 470,342 రిజిస్ట్రేషన్లు పరిశీలనకు అర్హమైనవిగా తేలింది. గతంలో ఒక్కో లబ్దిదారుడి సగటు రిజిస్ట్రేషన్లు 1.70 కాగా, ప్రస్తుతం ఇది 1.06కి పడిపోయింది.
Canada Study Permit: విదేశీ విద్యార్థులకు షాక్..కెనడా స్టడీ పర్మిట్లల్లో మళ్లీ కోత!
అమెరికా కలలు కంటున్న భారతీయులకు హెచ్-1బీ వీసా ప్రధాన మార్గంగా మారిన విషయం తెలిసిందే. 2023లో 386,000 వీసాలు జారీ కాగా వీటిల్లో ఏకంగా 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. తొలుత మూడేళ్ల కాలపరిమితిపై జారీ చేసే ఈ వీసా ఆ తరువాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. 10 డాలర్లు చెల్లించి కంపెనీలు లబ్దిదారుడి పేరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత దశల్లో కూడా లబ్ధిదారులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ల పరిశీలన కోసం కాన్సులార్ అపాయింట్ల కోసం పోటీ అధికంగా ఉంటోంది. ఇక డ్రాప్ బాక్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను చెన్నై కార్యాలయమే పరిశీలిస్తున్నప్పటికీ అన్ని వీసా కేంద్రాల్లో వీటిని దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదెలా ఉంటే తాజా మార్పుల దీర్ఘకాలిక ప్రభావం భారతీయులపై ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది.