పాండవ పక్షాన కౌరవుడు
ABN , Publish Date - May 16 , 2025 | 05:11 AM
దుర్యోధనాది కౌరవుల గురించి అందరికీ తెలుసు. కానీ ధృతరాష్ట్రుడి మరో కుమారుడైన యుయుత్సుడిది కూడా మహా భారతంలో విశిష్టమైన పాత్రే. అతని తల్లి సుఖద అనే వైశ్య వనిత. యుయుత్సుడు మహా వీరుడు. అతిరథుల్లో...
తెలుసుకుందాం
దుర్యోధనాది కౌరవుల గురించి అందరికీ తెలుసు. కానీ ధృతరాష్ట్రుడి మరో కుమారుడైన యుయుత్సుడిది కూడా మహా భారతంలో విశిష్టమైన పాత్రే. అతని తల్లి సుఖద అనే వైశ్య వనిత. యుయుత్సుడు మహా వీరుడు. అతిరథుల్లో ఒకడు. మొదటి నుంచీ దుర్యోధనుడితోనే కలిసి ఉండేవాడు. కౌరవ-పాండవ సమరం ప్రారంభమయ్యే సమయంలో ‘‘మేము అస్త్ర శస్త్రాలు పట్టింది ధర్మాన్ని రక్షించడానికి. మమ్మల్ని వ్యతిరేకించి, మమ్మల్ని ఎదిరించి పోరాడేవారందరూ ధర్మ విధ్వంసానికి పాల్పడేవారే. అలాకాకుండా ధర్మం వైపు నిలబడి ఎవరైనా పోరాడాలనుకుంటే వారికి స్వాగతం పలుకుతున్నాం’’ అని ధర్మరాజు చెప్పిన మాటలు యుయుత్సుణ్ణి ఆకర్షించాయి. ధర్మం పాండవులవైపే ఉందని గ్రహించాడు. తనవంతు సైన్యంతో సహా పాండవుల పక్షాన చేరి, కౌరవుల మీద యుద్ధం సాగించాడు. భారత యుద్ధం ముగిసింది. ధృతరాష్ట్రుడి కుమారుల్లో మిగిలినది యుయుత్సుడొక్కడే. ‘‘ధర్మానికి కట్టుబడిన యుయుత్సుణ్ణే కౌరవ సామ్రాజ్యానికి రాజును చేస్తాను. ఆ విధంగానైనా ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి కలుగుతుంది’’ అని ధర్మరాజు ప్రకటిస్తాడు. అయితే ధర్మవేత్తలు దానికి అభ్యంతరం చెబుతూ... క్షత్రియ సంతతికి చెందని యుయుత్సుడు రాజు కావడానికి అనర్హుడని అంటారు.
అప్పుడు పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా యుయుత్సుణ్ణి ధర్మరాజు నియమిస్తాడు. ఆ తరువాత స్వర్గారోహణకు బయలుదేరిన పాండవులు... అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు సంరక్షణ బాధ్యతను యుయుత్సుడికే అప్పగిస్తారు. పాండవ పక్షాన నిలిచి పోరాడిన కౌరవుడైన యుయుత్సుడు... మహా భారతంలోని విలక్షణమైన పాత్రల్లో ఒకటి.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News