Share News

Winter Fashion Stylish Shawls: చలికి చెక్‌ పెట్టే శాలువా

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:38 AM

చలి చంపడం మొదలుపెట్టేసింది. అలాగని స్వెటర్‌ వేసుకుందామంటే అది అన్ని డ్రస్సులకూ అనువుగా ఉండదు. అలాంటప్పుడు చుడీదార్‌ మీద చున్నీకి బదులుగా హాయిగొలిపే...

Winter Fashion Stylish Shawls: చలికి చెక్‌ పెట్టే శాలువా

ఫ్యాషన్‌

చలి చంపడం మొదలుపెట్టేసింది. అలాగని స్వెటర్‌ వేసుకుందామంటే అది అన్ని డ్రస్సులకూ అనువుగా ఉండదు. అలాంటప్పుడు చుడీదార్‌ మీద చున్నీకి బదులుగా హాయిగొలిపే శాలువాను వాడుకోవచ్చు. చలికాలం అక్కరకొచ్చే వెచ్చని కశ్మీర్‌ శాలువాలు, వాటిలోని వెరైటీస్‌ ఇవే.

శాలువా అనగానే ఎవరికైనా కశ్మీర్‌ శాలువాలు గుర్తుకొస్తాయి. వెచ్చదనంతో పాటు ఆకర్షణను కూడా తెచ్చిపెట్టే శాలువాలు నేటి తరం అమ్మాయిలకు ఎంతో బాగా నప్పుతాయి. సుతిమెత్తగా, సౌకర్యంగా ఉండే కశ్మీరు శాలువాలు పలు రకాల ఎంబ్రాయిడరీల్లో, పలురకాల పనితనాలతో తయారవుతూ ఉంటాయి.

జర్దోజి: జర్దోజి అనే పర్షియా పదానికి, బంగారాన్ని కుట్టడమని అర్థం. ఈ పనితనంలో బంగారం, వెండి దారాలను ఉపయోగిస్తారు. ప్రారంభంలో రాజకుటుంబాలకే పరిమితమైన ఈ పనితనం క్రమేపీ శాలువాలు, చీరలకూ విస్తరించింది. పూలు, పక్షులు, జామెట్రీ డిజైన్లలో రూపొందే ఈ తరహా శాలువాలు, సంక్లిష్టమైన పనితనానికి అద్దం పడుతూ ఉంటాయి.

క్రెవెల్‌: ఊలుతో విభిన్నమైన డిజైన్లను రూపొందించే ప్రక్రియ ఇది. జానపద కళారూపాల నుంచి ప్రేరణ పొందిన ఈ శైలిలో తయారైన ఎంబ్రాయిడరీలో పూలు, పక్షులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీన్లో భిన్నమైన కుట్లను కూడా ఉపయోగిస్తారు. శాటిన్‌ స్టిచ్‌, స్టెమ్‌ స్టిచ్‌, ఫ్రెంచ్‌ నాట్‌ వీటిలో అత్యంత ప్రత్యేకమైనవి.

కషిద: పట్టు దారంతో త్రీడి డిజైన్లతో కూడిన కషిద పనితనంలో ప్రకృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆకులు, పూలు, పండ్లు కషిద ఎంబ్రాయిడరీలో కనిపిస్తూ ఉంటాయి. ఉబ్బెత్తుగా కనిపించే ఈ తరహా ఎంబ్రాయిడరీ కోసం ఎంతో సమయం వెచ్చిస్తారు కాబట్టి కషిద శాలువాల ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 05:38 AM