Share News

Why You Should Change Your Bed Sheets: బెడ్‌షీట్స్‌ మార్చాల్సిందే

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:05 AM

బెడ్‌ మీద కూర్చున్నా పడుకున్నా బెడ్‌షీట్స్‌ నేరుగా చర్మానికి తగులుతూ ఉంటాయి. శరీరం నుంచి వెలువడే చెమట, జిడ్డు, మృతకణాలు లాంటివి బెడ్‌షీట్స్‌ మీద ఎక్కువగా...

Why You Should Change Your Bed Sheets: బెడ్‌షీట్స్‌ మార్చాల్సిందే

బెడ్‌ మీద కూర్చున్నా పడుకున్నా బెడ్‌షీట్స్‌ నేరుగా చర్మానికి తగులుతూ ఉంటాయి. శరీరం నుంచి వెలువడే చెమట, జిడ్డు, మృతకణాలు లాంటివి బెడ్‌షీట్స్‌ మీద ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. ఈ బెడ్‌షీట్స్‌ను రోజుల తరబడి మార్చకుండా అలాగే ఉంచితే ముఖంపై మొటిమలు, తుమ్ములు, కళ్లలో దురద, శ్వాసకోశ సమస్యలు, తలలో చుండ్రు లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • సాధారణంగా వారానికి ఒకసారి బెడ్‌షీట్స్‌ను మారిస్తే సరిపోతుంది. దీనివల్ల అవి చూడడానికి అహ్లాదకరంగా ఉండడంతోపాటు బెడ్‌ మీద పడుకున్న వెంటనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

  • కొంతమందికి ముఖం, వీపు, ఛాతి భాగాల్లో మొటిమలు, గుల్లలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు బెడ్‌షీట్స్‌ను రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. లేదంటే బెడ్‌షీట్స్‌మీద పేరుకున్న దుమ్ము, ధూళి చర్మ రంధ్రాల్లోకి చేరి వాటిని మూసివేస్తాయి. దీంతో మొటిమల సమస్య తీవ్రమవుతుంది. వీటితోపాటు అలెర్జీలు, దురద లాంటివి కూడా రావచ్చు. ఆస్తమా ఉన్నవారు కూడా తరచూ బెడ్‌షీట్స్‌ను మార్చాలి.

  • ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు, పెంపుడు జంతువులు ఉన్నా రోజూ బెడ్‌షీట్స్‌, దిండు గలీబులను మార్చడం మంచిది.

  • ఒక బకెట్‌లో సగానికి పైగా వేడి నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల లిక్విడ్‌ డిటర్జెంట్‌ లేదా సర్ఫ్‌ వేసి బాగా కలపాలి. ఈ నీటిలో బెడ్‌షీట్స్‌ను అరగంటసేపు నానబెట్టి ఆపైన చేత్తో ఉతికి తరువాతనే వాషింగ్‌ మెషిన్‌లో వేయాలి. లేదంటే బెడ్‌షీట్స్‌ మురికి వదలదు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..

మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Read Latest AP News and National News

Updated Date - Dec 11 , 2025 | 05:05 AM