Clean Blankets: దుప్పట్లు శుభ్రమేనా
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:50 AM
వారానికోసారి దుప్పట్లు శుభ్రం చేసుకోకపోతే, వాటి మీద పేరుకపోయే మృత చర్మ కణాలు, బ్యాక్టీరియా, ఫంగస్, డస్ట్ మైట్స్‌తో కలిసి నిద్రిస్తున్నట్టు లెక్క. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇదే నిజం. మనం నిద్రకు ముందు స్నానం చేస్తూ ఉంటాం. అయినా...
అవగాహన
వారానికోసారి దుప్పట్లు శుభ్రం చేసుకోకపోతే, వాటి మీద పేరుకపోయే మృత చర్మ కణాలు, బ్యాక్టీరియా, ఫంగస్, డస్ట్ మైట్స్‌తో కలిసి నిద్రిస్తున్నట్టు లెక్క. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇదే నిజం. మనం నిద్రకు ముందు స్నానం చేస్తూ ఉంటాం. అయినా ప్రతి రాత్రీ మన శరీరం వందలు, వేల మృత కణాలను, నూనెలనూ, స్వేదాన్నీ విసర్జిస్తూనే ఉంటుంది. ఇవన్నీ వాటిలో వృద్ధి చెందే డస్ట్ మైట్స్‌కు అనుకూలమైన పర్యావరణాలు. అయితే డస్ట్ మైట్స్‌తో మనకెలాంటి ఉండకపోవచ్చు కానీ వాటి విసర్జకాలు అలర్జీలు, ఉబ్బసం, ఎగ్జీమాలకు దారి తీస్తాయి. దుప్పట్ల మీద ఫంగస్ కూడా పెరగవచ్చు. మరీ ముఖ్యంగా దిండ్ల మీద పెరిగే కొన్ని ఫంగస్ జాతులు, రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్న వారిలో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలకు దోహదపడవచ్చు. అదే మంచాన్ని పెంపుడు జంతువులతో పంచుకునే అలవాటున్నవాళ్లు, అదనపు ఆరోగ్య సమస్యలకు సిద్ధపడాలి. వాటితో పడక మీదకు చేరే అదనపు ధూళి, రోమాలు, చుండ్రు, విసర్జకాల అవశేషాలు మరికొన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. కాబట్టి దుప్పట్లు, దిండు కవర్లను వారానికోసారి తప్పనిసరిగా శుభ్రం చేస్తూ ఉండాలి. సుస్తీ చేసినా, ఎక్కువ స్వేదం వెలువరిచే గుణం కలిగి ఉన్నా, ఇంట్లో పెంపుడు జంతువులున్నా ప్రతి నాలుగు రోజులకోసారి దుప్పట్లు, దిండ్ల కవర్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే మందపాటి బ్లాంకెట్లను ప్రతి రెండు వారాలకూ, డ్యువెట్ కవర్లను ప్రతి 3 నుంచి 4 నెలలకూ శుభ్రపరుస్తూ ఉండాలి. దిండ్లను ప్రతి నాలుగు నెలలకు శుభ్రపరుస్తూ, పరుపులను వారానికోసారి వ్యాక్యూమ్ క్లీన్ చేయాలి. తరచూ ఆరుబయట ఎండకు ఆరబెడుతూ ఉండాలి.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..