American Woman in India: భారత్ అంటే. నాకెందుకు ఇష్టం
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:20 AM
క్రిస్టెన్ ఫిషర్... అమెరికన్ మహిళ. నలుగురు పిల్లల తల్లి. ఆమె గత నాలుగేళ్లుగా భారతదేశంలో నివసిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్‌గా తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ...
క్రిస్టెన్ ఫిషర్... అమెరికన్ మహిళ. నలుగురు పిల్లల తల్లి. ఆమె గత నాలుగేళ్లుగా భారతదేశంలో నివసిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్‌గా తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమెరికా, భారత్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ ఆమె చేసిన వీడియోలకు సోషల్ మీడియాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. మన దేశంలో ఆమెకు ఆకర్షించిన విషయాలు- ఆసక్తికరమైనవి.. అవేమిటో చూద్దాం..
ప్రతి ఇంట్లో రోజుకు రెండు లేదా మూడుసార్లు వంట చేయడం ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నేను కూడా క్రమం తప్పకుండా వంట చేయటం నేర్చుకున్నా. భారతీయ శాఖాహార వంటలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిని నేను కూడా శాఖాహారిగా మారిపోయాను.
భారత మహిళలంటే చీరలు గుర్తుకొస్తాయి. నేను కూడా చీర కట్టుకోవటం నేర్చుకున్నా. చీర కట్టుకున్నప్పుడల్లా అందమైన అనుభూతి కలుగుతుంది.
బజారులో వస్తువులు, కూరగాయలు, పండ్లు కొనేటప్పుడు బేరసారాలు ఆడడం సరదాగా ఉంటుంది. వర్తకులు ధర తగ్గించినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది.
అమెరికాలో పలు రకాల వస్తువులు లారీల ద్వారా రవాణా అవుతుంటాయి. మనవద్దకు వచ్చే సరికి అవి పాతబడుతుంటాయి. అదే భారత్‌లో అయితే స్థానికంగా ఉండే వీధి వ్యాపారుల వద్ద అన్ని వస్తువులు కొత్తగా కనిపిస్తుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని కొనుక్కోవచ్చు.
అమెరికాలో స్కూటర్స్, బైక్స్ నడిపేవారు తక్కువగా ఉంటారు. ఇక్కడ మాత్రం అవి అందుకే నేను కూడా స్కూటర్ నడపడం నేర్చుకున్నా. దీనిమీద ప్రయాణించడం అనుకూలంగా ఉంటుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. సమయమూ మిగులుతుంది.

భారత్ వచ్చాక నా ఆలోచనా విధానం మారింది. సర్దుబాటు ధోరణి పెరిగింది. ఏ ప్రదేశం కూడా పూర్తిగా మనకు నచ్చినట్లు పరిపూర్ణంగా ఉండదు. అందరూ అనుకుంటున్నట్లు అమెరికాలో అంతా సంతోషమే ఉండదు. ఎక్కడ ఉన్నా మనకు మనమే ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆ శక్తి మనకు ఉంటుంది. ప్రతికూలతలను పక్కనపెట్టి సానుకూలతలను ఆస్వాదించాలి. అప్పుడే జీవితం ఆనందమయమవుతుంది.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News