Health Benefits of Eating Cooked Apples: యాపిల్స్‌ను ఉడికించి తింటే
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:09 AM
యాపిల్ జ్యూస్ తాగుతాం. ముక్కలు చేసుకుని తింటాం. అయితే వీటిని ఉడికించి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది...
ఆరోగ్యం - ఆహారం
యాపిల్ జ్యూస్ తాగుతాం. ముక్కలు చేసుకుని తింటాం. అయితే వీటిని ఉడికించి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది.
యాపిల్స్‌ను ఉడికించినప్పుడు వాటిలో పెరిగే పెక్టిన్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. దాంతో పేగుల్లోని వాతావరణం మెరుగుపడుతుంది
నీటిలో కరిగే పీచు పేగుల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించి, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది
యాపిల్స్‌ను ఉడికించడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. దాంతో అజీర్తి తలెత్తదు
వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఫలితంగా పేగుల్లోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది
ఇలా వండుకోవాలి: రెండు యాపిల్స్‌ను శుభ్రంగా కడిగి, తొక్కు తొలగించాలి. ముక్కలుగా కోసి, విత్తనాలు తొలగించాలి. ఆ తర్వాత బాండీలో అర కప్పు నీళ్లు పోసి, యాపిల్ ముక్కలు జోడించి, అర టీస్పూను దాల్చినచెక్క పొడి, అర చెక్క నిమ్మరసం పిండి, చిన్న మంట మీద ఏడు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తబడే కలుపుతూ ఉడికించిన తర్వాత, ఈ పదార్థాన్ని అలాగే తినొచ్చు లేదా పెరుగు జోడించి తినొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News