Weight Training Benefits: బరువులు ఎత్తుతున్నారా
ABN , Publish Date - Sep 23 , 2025 | 02:30 AM
ప్రి మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు, మొండి కొవ్వులు హార్మోన్ల అవకతవకల ప్రధాన లక్షణాలు. ఇలా హెచ్చుతగ్గులకు లోనయ్యే హార్మోన్లను గాడిలో పెట్టాలంటే మహిళలు...
వ్యాయామం
ప్రి మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు, మొండి కొవ్వులు హార్మోన్ల అవకతవకల ప్రధాన లక్షణాలు. ఇలా హెచ్చుతగ్గులకు లోనయ్యే హార్మోన్లను గాడిలో పెట్టాలంటే మహిళలు తప్పనిసరిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కేవలం కండరాల వ్యాయామం మాత్రమే కాదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ఇన్సులిన్, కార్టిసాల్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల క్రమబద్ధీకరణకు ఈ వ్యాయామం అవసరం. బరువులు ఎత్తడం హార్మోన్ చికిత్సతో సమానం. బరువులు ఎత్తడం వల్ల శరీరంలో అదనపు ఈస్ట్రోజన్ తగ్గడంతో పాటు ప్రొజెస్టరాన్ సహజసిద్ధంగా పెరుగుతుంది. ఫలితంగా నెలసరి నొప్పులు, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు అదుపులోకొచ్చి, నెలసరి కూడా గాడిలో పడుతుంది. అలాగే బరువులెత్తే వ్యాయామాలతో కండరాలు బలపడి, గ్లూకోజ్‌ను నిల్వ ఉంచుకునే సామర్థ్యం మెరుగుపడి, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇలాంటి ఇన్సులిన్ సంతులనం శక్తిని అందిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అండాల విడుదలను క్రమబద్ధం చేస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. బరువులెత్తే వ్యాయామాలతో నాడీ వ్యవస్థ దృఢపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌కు గురి కాకుండా ఒత్తిడిని తగ్గించుకునే సామర్థ్యం పెరుగుతుంది. 40 ఏళ్ల వయసు మహిళలు బరువులెత్తే వ్యాయామాలు చేయగలిగితే, ఎముకల సాంద్రత పెరుగుతుంది. పొట్ట కొవ్వు తగ్గుతుంది.కండర క్షీణత తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News