Share News

Liver Health New Study Insights: ఈ మందులతో కాలేయ రక్ష

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:02 AM

బరువు తగ్గించే మందులతో కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఒక తాజా అధ్యయనం, వరల్డ్‌ జర్నల్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురితమైంది. మరిన్ని వివరాలు...

Liver Health New Study Insights: ఈ మందులతో కాలేయ రక్ష

బరువు తగ్గించే మందులతో కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఒక తాజా అధ్యయనం, వరల్డ్‌ జర్నల్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురితమైంది. మరిన్ని వివరాలు...

కాలేయ జబ్బు మూలంగా మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌ సమస్యను ఎదుర్కొంటున్న రోగులకు, స్థూలకాయం, మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు కాలేయానికి ప్రయోజనాలను అందిస్తున్నట్టు, ‘ఎఫికసీ అండ్‌ సేఫ్టీ ఆఫ్‌ యాంటి ఒబేసిటీ డ్రగ్స్‌ ఇన్‌ మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌ అసోసియేటెడ్‌ స్టెటోయిక్‌ లివర్‌ డిసీజ్‌’ అనే పేరుతో చేపట్టిన ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు, మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌ ఫలితంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌ అసోసియేటెడ్‌ స్టెటో హెపటైటిస్‌, మ్యాష్‌ సమస్యతో బాధపడే రోగుల్లో కాలేయ కణాలు దెబ్బతిని, అంతిమంగా కాలేయం, ఫైబ్రోసిస్‌, సిర్రోసి్‌సకు దారి తీస్తూ ఉంటుంది. అయితే సంపద్రాయ చికిత్సలో భాగంగా జీవనశైలి మార్పులు, ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకోవడం లాంటి నియమాలను వైద్యులు సూచిస్తూ ఉంటారు. వీటితో ఫలితం కనిపించని సందర్భాల్లో అంతిమంగా సర్జరీని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మ్యాష్‌ సమస్యతో బాధపడుతున్న రోగులకు లీరాగ్లూటైడ్‌ లాంటి బరువు తగ్గించే మందులను 48 వారాల పాటు సూచించినప్పుడు. ఆ రోగులు బరువు తగ్గడంతో పాటు వారి కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతున్న స్పష్టమైంది. అలాగే సెమాగ్లూటైడ్‌తో కాలేయంలో కొవ్వు పేరుకునే తీవ్రత తగ్గడంతో పాటు శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే తీరు మెరుగుపడి, కాలేయ వాపు, నొప్పి అదుపులోకొచ్చాయి. ఈ మందులతో కాలేయ ఫైబ్రోసిస్‌ కూడా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రయోగాల్లో తేలింది కాబట్టి బరువును తగ్గించే మందులు కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని పరిశోధకులు అంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 06:02 AM