Trendy Princess Gowns: చిట్టిపొట్టి ప్రిన్సెస్
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:42 AM
చిట్టిపొట్టి ‘ప్రిన్సెస్’
ఫ్యాషన్
వేడుకల్లో ఆడపిల్లలకు వేసే డ్రస్సులు వినూత్నంగా ఉండాలంటే ప్రిన్సెస్ గౌన్స్ ఎంచుకోవాలి. చూడముచ్చటగా కనిపించే ప్రిన్సెస్ గౌన్స్ నేడు ఎన్నో రకాల డిజైన్లలో రూపొందుతున్నాయి. ఈ తాజా ట్రెండ్ మీద ఓ లుక్కేద్దాం!
చిట్టిపొట్టి గౌన్లకు బదులుగా పాదాల వరకూ పొడవుగా ఉండే ప్రిన్సెస్ గౌన్స్... నెట్టెడ్, ఎంబ్రాయిడరీ, ఫ్యూజన్... ఇలా ఎన్నో రకాల డిజైన్లలో రూపొందుతున్నాయి. పలు రకాల సెక్కిన్లు, పూసలు, జరీ వర్క్‌లతో తయారవుతున్న ఈ గౌన్స్ అన్ని రకాల వేడుకలకూ అనువుగా ఉంటాయి. అయితే ప్రిన్సెస్ గౌన్స్‌లో ఆడపిల్లలు రాకుమారిలా వెలిగిపోవాలంటే ఇంకొన్ని హంగులు కూడా జోడించాలి. అవేంటంటే....
మెరుపులు చిందించే శాండిల్స్ ఎంచుకోవాలి. అయితే హీల్ లేకుండా చదునుగా ఉండేవైతే పిల్లలు సౌకర్యంగా నడవగలుగుతారు
ప్రత్యేకించి పిల్లల కోసం కూడా సౌందర్య సాధనాలుంటాయి. కాబట్టి సున్నితమైన చర్మాలకోసం తయారైన మేకప్ ఉత్పత్తులనే ఎంచుకోవాలి
గౌన్ అసౌకర్యంగా లేకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా గౌన్ లోపలి వైపు సుతిమెత్తని మెటీరియల్ లైనింగ్ ఉండేలా చూసుకోవాలి
పిల్లల కోసమే ప్రత్యేకంగా తయారయ్యే హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. గౌన్‌తో హ్యాండ్ బ్యాగ్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి
వాచ్‌ను ఇష్టపడే పిల్లల కోసం క్రిస్టల్స్‌తో తయారైన డయల్, స్ర్టాప్ కలిగిన వాచీని ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News